హైదరాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

జేఎన్‌టీయూకు బాంబు బెదిరింపు

– క్షుణ్నంగా తనిఖీ.. ఏమీ లేదని తేల్చిన పోలీసులు

బాలానగర్‌: జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మంగళవారం బాంబు బెదిరింపు ఇ–మెయిల్‌ వచ్చింది. వర్సిటీ అధికారుల సమాచారం మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు, బాంబుస్క్వాడ్‌ వచ్చి వర్సిటీ పరిపాలన భవనం, హాస్టల్స్‌, క్యాంపస్‌ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లభించకపోవడంతో ఆచార్యులు, విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు వర్సిటీలో కొంత ఆందోళన వాతావరణం కనిపించింది. అనంతరం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ డీఐ కేఎస్‌ రవి సైబర్‌ భద్రత, సైబర్‌ ముప్పుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ మాట్లాడుతూ బాంబు బెదిరింపు వదంతిని సృష్టించిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

నగరవ్యాప్తంగా హెచ్‌–న్యూ స్పెషల్‌ డ్రైవ్‌

మూడు ఠాణాల పరిధిలో మాటేసి దాడులు

ఐదుగురు పెడ్లర్‌, సబ్‌ పెడ్లర్ల పట్టివేత

రూ.63.65 లక్షల సరుకు స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement