తెలంగాణ ఉద్యమకారుడు సుల్తాన్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమకారుడు సుల్తాన్‌ ఆత్మహత్య

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

– డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కేటాయించకపోవడంతో కొంతకాలంగా మనస్తాపం

బన్సీలాల్‌పేట్‌: బన్సీలాల్‌పేట్‌ బండమైసమ్మనగర్‌ నివాసి, తెలంగాణ ఉద్యమకారుడు అబ్దుల్‌ సుల్తాన్‌(65) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ బోస్‌ కిరణ్‌ కథనం ప్రకారం... సుల్తాన్‌ భార్య రేష్మా రేషన్‌ బియ్యం తేవడానికి షాపునకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చి చూసే వరకు ఆయన ఉరేసుకొని ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు గాంధీనగర్‌ పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టమ్‌ అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మంగళవారం రాత్రి బన్సీలాల్‌పేట్‌లో సుల్తాన్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలు తొలగించండి

– ఎంఎంసీ కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాలు

సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణం, టీడీఆర్‌ దరఖాస్తులకు సంబంధించి జాప్యం లేకుండా నిర్ణీత వ్యవధుల్లో అనుమతులు జారీ చేయాలని ఎంఎంసీ కమిషనర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశిచారు. మంగళవారం టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారుతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అక్రమ నిర్మాణాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్‌ఫాత్‌లు, నాలాలపై ఆక్రమణలను వెంటనే తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వీటితోపాటు నివాస కాలనీల్లోని అక్రమ నిర్మాణాలు, సెల్లార్లు, రోడ్లను ఆక్రమించిన ర్యాంపులు, మొక్కలు లేని ప్లాంటర్‌ బాక్స్‌లను వెంటనే తొలగించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement