మైలార్‌దేవ్‌పల్లి: కల్తీ మసాలాలు, ఉత్పత్తులు తయారు చేస్తున్న రెండు పరిశ్రమలపై హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం, పుడ్ సేఫ్టీ అధికారులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. టాటానగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ఫైన్ ట్రేడర్స్ పేరుతో స్నాక్స్‌ను అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నారు. కెమికల్స్ వాడుతున్నారు. గడువు తేదీ ముగిసిన మిర్చి పౌడర్, కలర్స్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 వేల విలువ చేసే ముడి సరుకును స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో హెచ్‌పాస్ట్ ఎస్‌ఐ అఖిల్, మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌ఐ విశ్వనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
కాటేదాన్‌లో...
కాటేదాన్ పారిశ్రామికవాడలో సిల్వర్ మసాలా ప్రొడక్ట్‌స్ తయారీ పరిశ్రమపై దాడులు నిర్వహించారు. ఇక్కడ హానికరమైన రసాయన పదార్ధాలు, నాణ్యతలేని, అపరిశుభ్రమైన పదార్థాలతో మసాలాలు తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి 40 వేల విలువ చేసే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.


