సీఎం నివాసం ముట్టడికి యత్నం
బంజారాహిల్స్: బంజారాల ఆరాధ్యదైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠను హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ‘చలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడి’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి బంజారా సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుని వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతీలాల్‌నాయక్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సక్రిబాయిలు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నల్లమల అటవీ ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగు ప్రాంతంలో ప్రతిష్టించడం అంటే లంబాడీలను అవమానపరిచినట్లేనన్నారు. ప్రభుత్వానికి లంబాడీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే నగరంలో గానీ, నగర పరిసర ప్రాంతాల్లో గానీ విగ్రహంతో పాటు సేవాలాల్ మందిరం నిర్మించాలన్నారు.
సేవాలాల్ బంజారా సంఘం నేతల అరెస్టు


