72 ఏళ్ల వృద్ధురాలికి..అరుదైన శస్త్రచికిత్స
రాంగోపాల్‌పేట్: మిట్రల్ వాల్వ్ లీకేజీ సమస్యతో బాధపడుతున్న ఓ 72 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన మినిమల్ ఇన్వేసిస్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రమోద్‌కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు శ్వాస, అలసట సమస్యలతో బాధపడుతుంది. పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో మెడికవర్ ఆస్పత్రికి వచ్చారు. మిట్రల్ వాల్వ్‌లో తీవ్రమైన లీకేజ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో విదేశాల్లోనే చేసే మినిమల్ ఇన్వేసిస్ చికిత్స చేయాలని నిర్ణయించి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వృద్ధురాలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ భుయార్, డాక్టర్ ఎన్ శివప్రసాద్ నాయుడు, అమరేందర్ కుమార్ సింగ్, డాక్టర్ వరుణ్ గౌతమ్, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


