
బంజారాహిల్స్: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని మసీదు కమిటీలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా మసీదుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కవితారెడ్డి, సంగీతా యాదవ్ పాల్గొన్నారు.