టీజీ ఎన్పీడీసీఎల్‌కు పీఎస్‌యూ ఐటీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

టీజీ ఎన్పీడీసీఎల్‌కు పీఎస్‌యూ ఐటీ అవార్డు

Jun 2 2026 9:49 AM | Updated on Jun 2 2026 9:49 AM

టీజీ ఎన్పీడీసీఎల్‌కు పీఎస్‌యూ ఐటీ అవార్డు

హన్మకొండ: తెలంగాణ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీ ఎన్పీడీసీఎల్‌) ప్రతిష్టాత్మక పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ ఐటీ అవార్డు అందుకుంది. ఈ అవార్డును సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎండీ (చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌) కర్నాటి వరుణ్‌రెడ్డికి కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, ఐటీ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ అందించారు. డిజిటల్‌ సేవల విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తున్నందుకు, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు గవర్నెన్స్‌ నౌ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మే 29న న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గవర్నెన్స్‌ నౌ 11 ఇండియా పీఎస్‌యూ ఐటీ అవార్డును టీజీ ఎన్పీడీసీఎల్‌ సెక్రటరీ కె.వెంకటేశం, ఐటీ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ నిర్వాహకుల నుంచి అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement