సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐలు)లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)లు భారీ ఎత్తున బదిలీ అయ్యారు. సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పలువురు అధికారులు వచ్చారు. అదే సమయంలో ఈ జిల్లాల నుంచి మరికొందరు ఇతర డిస్ట్రిక్ట్‌లకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ కె.ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి బదిలీ అయిన ఎంవీఐలు..
టి.జయపాల్‌రెడ్డి డీటీఓ వరంగల్ నుంచి డీటీసీ కరీంనగర్‌కు, రమేశ్ రాథోడ్ డీటీసీ హనుమకొండ నుంచి డీటీసీ నిజామాబాద్‌కు, బి.కిశోర్‌బాబు డీటీసీ హనుమకొండ నుంచి డీటీసీ ఆదిలాబాద్‌కు మహ్మద్ సంధాని డీటీఓ భూపాలపల్లి నుంచి డీటీఓ జగిత్యాలకు, మహ్మద్ గౌస్‌పాషా (సస్పెన్షన్‌లో) డీటీఓ మహబూబాబాద్ నుంచి డీటీసీ ఆదిలాబాద్ అటాచ్డ్ అయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన
ఎంవీఐలు..
బి. కిరణ్‌కుమార్ నిజామాబాద్ డీటీసీ నుంచి హనుమకొండ డీటీసీకి, టి.జనార్దన్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం నుంచి హనుమకొండ డీటీసీకి, వి. వెంకటరమణ ఖమ్మం డీటీఓ నుంచి హనుమకొండ డీటీసీకి, ఆర్. నాగలక్ష్మి కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, జి.వేణుగోపాల్ హనుమకొండ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు, జె.శ్రీనివాస్ కామారెడ్డి డీటీఓ నుంచి వరంగల్ డీటీఓకు, శివపల్లి శ్రీనివాస్ ఆదిలాబాద్ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు, ఠాకూర్ ఈశ్వర్‌సింగ్ నిర్మల్ జిల్లా నుంచి ములుగు డీటీఓకు, ఎం.వెంకన్న జగిత్యాల డీటీఓ నుంచి జేఎస్ భూపాలపల్లి డీటీఓకు, బి.శంకర్ కొమురంభీం ఆసిఫాబాద్ నుంచి మహబూబాబాద్ డీటీఓకు, ఎ.మహేందర్ నిర్మల్ జిల్లా నుంచి మహబూబాబాద్ డీటీఓకు, బి.శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి జేఎస్ భూపాలపల్లి డీటీఓకు వచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి
బదిలీ అయిన ఏఎంవీఐలు..
ఎం.సాయిచరణ్ మహబూబాబాద్ నుంచి జగిత్యాలకు, బి.విజయశాంతి హనుమకొండ డీటీసీ నుంచి మహబూబాబాద్‌కు, కీర్తి ఉదయ్ హనుమకొండ డీటీసీ నుంచి కరీంనగర్ డీటీసీ (స్పౌజ్ గ్రౌండ్స్)కి బదిలీ అయ్యారు.
ఉమ్మడి వరంగల్‌కు వచ్చిన ఏఎంవీఐలు..
కొమ్ము శ్రీనివాస్ కామారెడ్డి నుంచి ములుగుకు, డి. శ్రీకాంత్ నిజామాబాద్ నుంచి ములుగుకు, ఎం.డి. అఫ్రోజుద్దీన్ కామారెడ్డి నుంచి వరంగల్‌కు, శంకర్ మూడ్ కామారెడ్డి డీటీఓ నుంచి వరంగల్‌కు, షేక్ కాసీం మంచిర్యాల నుంచి మహబూబాబాద్‌కు, బి. విజయశాంతి హనుమకొండ డీటీసీ నుంచి మహబూబాబాద్‌కు, ఎం.శాలిని కేబీ ఆసిఫాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, జి.మాధవి కేబీ ఆసిఫాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, బి.అపర్ణ ఆదిలాబాద్ నుంచి హనుమకొండ డీటీసీకి, కొట్టె మధుకర్ కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, బి.శ్రావణ్ కుమార్ కామారెడ్డి నుంచి హనుమకొండ డీటీసీకి, నిహారిక సర్జన ఆదిలాబాద్ డీటీసీ నుంచి వరంగల్ డీటీఓకు వచ్చారు.
ఏఓలకు స్థానచలనం..
ఎంవీఐ, ఏఎంవీఐలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారు(ఏఓ)లకు స్థానచలనం కలిగింది. వరంగల్ డీటీఓ కార్యాలయం ఏఓ బి.నరేందర్ హనుమకొండ డీటీసీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం ఏఓ జి.సుభాషిణిని నియమించారు. జనగామ ఏఓ ఖలీల్ సూర్యాపేటకు, సూర్యాపేట నుంచి కె.బెంజమిన్ జనగామకు బదిలీ అయ్యారు.
పలువురు ఎంవీఐలు,
ఏఎంవీఐలకు స్థానచలనం
ఉమ్మడి వరంగల్ నుంచే ఎక్కువ
మంది.. అదే స్థాయిలో నియామకాలు
ఇన్‌చార్జ్ డీటీఓలుగా
కొందరు ఎంవీఐలు
రెండున్నరేళ్లలో ఇదే మొదటిసారి


