3 నెలల్లో ‘సూపర్‌’ పనులు పూర్తి | - | Sakshi
Sakshi News home page

3 నెలల్లో ‘సూపర్‌’ పనులు పూర్తి

Jun 2 2026 9:49 AM | Updated on Jun 2 2026 9:49 AM

3 నెలల్లో ‘సూపర్‌’ పనులు పూర్తి

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి

కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ భవన నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్‌ సూపర్‌ మల్టిస్పెషాలిటీ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన ఆస్పత్రిలోని మొదటి, రెండో అంతస్తులను పరిశీలించి, పనుల పురోగతి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

పర్యావరణ పరిరక్షించాలి..

హన్మకొండ అర్బన్‌: పర్యావరణాన్ని పరిరక్షించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కుడా కార్యాలయంలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, సత్యశారద, జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసస్వామి, పర్యావరణ శాస్త్రవేత్త జీమూత వాహన్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement