సమస్యల్లో పద్మావతినగర్‌ కాలనీ | - | Sakshi
Sakshi News home page

సమస్యల్లో పద్మావతినగర్‌ కాలనీ

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించాలి

హసన్‌పర్తి: ఒకటోవ డివిజన్‌ ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలోని పద్మావతి నగర్‌ కాలనీ సమస్యలతో సతమతమవుతోంది. పేరుకే కాలనీ. ఈ కాలనీలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ఇళ్లల్లో నుంచి విడుదలవుతున్న మురుగు నీరు రోడ్లపైకి చేరి బురదగా మారుతోంది. దీంతో బాటసారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మురికికాల్వల వ్యవస్థ ఇలా ఉంటే కాలనీల్లోని పలు ప్రాంతాల్లో రోడ్డు వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. పలు ఏరియాల్లో రోడ్లు గుంతలుగా మారడం వల్ల వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీలోని పలు ప్రాంతాల్లో వీధిదీపాలు లేకపోవడం రాత్రివేళల్లో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ఈ కాలనీలో కుక్కల బెడద కూడా అధికంగా ఉంది. ఇప్పటికే కుక్కల దాడిలో పలువురు గాయాలపాలై ఆస్పత్రికి చేరిన సంఘటనలు ఉన్నాయి. కాగా రోడ్లపైకి మురికినీ రు చేరడంతో ఆయా ఇ ళ్లలో యజమానులు గొడవకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో గొడవలు పడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన దాఖలు కూడా ఉన్నాయి.

దోమల బెడద

మురికికాల్వల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో కాలనీలో దోమల బెడద తీవ్రంగా ఉంది. మూడేళ్లుగా కాలనీలో పైసా అభివృద్ధి పని జరగలేదని కాలనీవాసులు తెలిపారు. ప్రతీ ఏడాది పన్నులు సక్రమంగానే చెల్లిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.

అస్తవ్యస్తంగా డ్రెయినేజీ

ఎక్కడపడితే అక్కడే మురుగునీరు

అభివృద్ధి శూన్యం

కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పించాలని అధికారులు దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చే సినా స్పందన లేదు. ఎవరికీ చెప్పుకోవాలో తెలి యని పరిస్థితి. – తోట నాగురాజు, కాలనీవాసి

ఎమ్మెల్యే కాలనీపై ప్రత్యేక దృష్టి సారించాలి. కాలనీలో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధులు విడుద ల చేయాలి. ఇక్కడ పైసా అభివృద్ది జరిగిన దాఖ లాలు లేవు. – మూల దేవేందర్‌, కాలనీవాసి

Advertisement
 
Advertisement
Advertisement