భీమదేవరపల్లి : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్ర గ్గిస్ట్ పిలుపునిచ్చిన 24 గంటల మెడికల్ షాపుల దేశవ్యాప్త బంద్ మండలంలో బుధవారం విజయవతంగా ముగిసినట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న కెమిస్టులు ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఫార్మసీల ప్రభావం, మారుతున్న ప్రభుత్వ నిబంధనలు, పెరుగుతున్న వ్యాపార పోటీ కారణంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చిన్న కెమిస్టుల హక్కులను పరిరక్షించేందుకు, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ బంద్ నిర్వహించినట్లు తెలిపారు. మండలంలోని ఔషధ వ్యాపారులు సంఘిభావం ప్రకటించి దుకాణాలను మూసివేశారు. బొజ్జపూరి మురళి, మామిడాల రవీందర్, ఉడుత శ్రీనాథ్, వనరాజు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


