కాజీపేట రూరల్: కాజీపేట డీజిల్ లోకో షెడ్‌కు సమష్టి కృషితోనే దేశంలో మంచి గుర్తింపు లభించిందని డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ ఎన్.వి.వెంకటకుమార్ అన్నారు. మంగళవారం రాత్రి డీజిల్ లోకో షెడ్ 53 వసంతాల వేడుకలు కనులపండువగా జరిగాయి. రైల్వే సీనియర్ డీఎంఈ వెంకటకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అధికారుల సహకారంతో డీజిల్ షెడ్ రైల్వే అధికారులు, సూపర్‌వైజర్లు, రైల్వే కార్మికులు విధుల నిర్వహణలో మంచి ఫలితాలతో 53 వసంతాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీనియర్ డీఈఈ కేవీ.హరికృష్ణ కేక్ కట్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఎంఈ అనికేత్ ఖడ్గే, ఎడీఎంఈలు శ్రీనివాస్‌రావు, నాగరాజశేఖర్, ఏడీఈ సతీశ్‌కుమార్, ఏసీఎంటీ మల్లికార్జునరావు, ఎ.ఎం.ఎం రాజేశ్, కాజీపేట స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, యూనియన్ డీజిల్ బ్రాంచ్ నాయకులు పాక వేదప్రకాశ్, ఎస్.కె.జానీమియా, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, రవికిరణ్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డీజిల్ బ్రాంచ్ నాయకులు సీడబ్ల్యూసీ మెంబర్ ఎ.మధుసూదన్‌రావు, ఎస్.సమ్మయ్య, ఇ.రాములు, ఆర్.వెంకటేశ్వర్లు, టి.ప్రవీణ్, ఎ.ప్రదీప్‌కుమార్, రైల్వే ఓబీసీ సంఘం నుంచి ఎ.సంతోష్‌కుమార్, శ్యామ్, ఆంజనేయులు, రైల్వే ఎస్సీ ఎస్టీ సంఘం నుంచి పాండు, నాయక్, దేవేందర్, రైల్వే కార్మికులు, కార్మిక కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
రైల్వే సీనియర్ డీఎంఈ వెంకటకుమార్
ఘనంగా డీజిల్ షెడ్ 53 వసంతాల వేడుకలు


