నిర్ణీత గడువులోగా కమిటీలు | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత గడువులోగా కమిటీలు

Apr 29 2026 7:12 AM | Updated on Apr 29 2026 7:12 AM

నిర్ణీత గడువులోగా కమిటీలు

హన్మకొండ చౌరస్తా: పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నిర్ణీత గడువులోగా జిల్లా, మండల, గ్రామ కమిటీల నియామకాలను పూర్తిచేయాలని కాంగ్రెస్‌ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ (డీపీఏసీ) తీర్మానించింది. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో మంగళవారం జిల్లా పీఏసీ మొదటి సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం కోసం ప్రతి యూనిట్‌కు ఒక అధ్యక్షుడిని నియమించి బాధ్యతలను వికేంద్రీకరించాలని అన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఎన్నికల్లో విజయం బూత్‌ స్థాయిలోనే ఖరారవుతుందని, అందుకే ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బీఎల్‌ఏ–2 నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల జాబితా పరిశీలన నుంచి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. గిగ్‌ వర్కర్లకు ప్రత్యేక చట్టం తీసుకురావడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించారు. డీసీసీ కార్యాలయానికి మడికొండ శివారులో స్థలం కేటా యిస్తే ఎలా ఉంటుంద నే అంశంపై చర్చించారు. టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హుజూరాబాద్‌ ఇన్‌చార్జ్‌ వొడితెల ప్రణవ్‌, టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీనుబాబు, కార్పొరేటర్‌ తోట వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, బొమ్మతి విక్రమ్‌, శనిగరం సుధాకర్‌, బొచ్చు చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ వ్యవహారాల కమిటీ తీర్మానం

డీసీసీ ఆఫీస్‌కు స్థలం

కేటాయింపు పై చర్చ

Advertisement
 
Advertisement
Advertisement