వరంగల్ కలెక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: పిల్లల భద్రత అందరి బాధ్యత అని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వరంగల్ ఐఎంఏ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతను డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ గృహాల్లోని పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ రాజమణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అధికారులు పాల్గొన్నారు.


