‘పెట్రో’ బారులు | - | Sakshi
Sakshi News home page

‘పెట్రో’ బారులు

Apr 28 2026 7:17 AM | Updated on Apr 28 2026 7:17 AM

‘పెట్రో’ బారులు

క్యాన్లు, చిన్నపాటి డ్రమ్ములతో గంటల తరబడి క్యూ

పలుచోట్ల నో స్టాక్‌ బోర్డులు

పెట్రోల్‌, డీజిల్‌ కొరత నెలకొందన్న సమాచారం సోమవారం సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొట్టడంతో వాహనదారులు ఒక్కసారిగా బంకుల దారి పట్టారు. ద్విచక్ర, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు నగరంలోని బంకులవద్ద బారులుదీరాయి. కొందరు అయితే క్యాన్లు, చిన్నపాటి డ్రమ్ములను తీసుకొచ్చారు. ఏ బంక్‌ వద్ద చూసినా చాంతాడంత క్యూలైన్లు కనిపించాయి. మధ్యాహ్నం తరువాత కొన్ని బంకులు స్టాక్‌ బోర్డులు కూడా పెట్టేశాయి. పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. దీంతో ఇలాంటి ఊహాగానాలు వెలువడిన ప్రతీసారి బంకులవైపు పరుగులు తీయడం పరిపాటిగా మారిందన్న వాదన వినిపిస్తోంది. – సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్లు హన్మకొండ, వరంగల్‌

Advertisement
 
Advertisement
Advertisement