ఆవేదనలు.. నివేదనలు | - | Sakshi
Sakshi News home page

ఆవేదనలు.. నివేదనలు

Apr 28 2026 7:17 AM | Updated on Apr 28 2026 7:17 AM

ఆవేదనలు.. నివేదనలు

ఫిర్యాదుల్లో కొన్ని..

వరంగల్‌ అర్బన్‌: గ్రీవెన్స్‌లో అందించిన వినతులను సిబ్బంది ఖాతరు చేయడం లేదని, వాటి పరిష్కారం కోసం పలుమార్లు వినతులు అందజేయాల్సి వస్తోందని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా కార్యాలయంలో గ్రీవెన్స్‌ సెల్‌ అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, వింగ్‌ అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. గ్రేటర్‌ వరంగల్‌కు మొత్తం 111 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్‌ ప్లానింగ్‌కు ఆతిక్రమణలు, ఆక్రమణలపై 58 దరఖాస్తులు నమోదు కావడం గమనార్హం. పట్టణ ప్రణాళికా విభాగానికి ప్రతీ ప్రజావాణిలో సగానికి పైగా అర్జీలు వస్తున్నాయి. కానీ, ఆయా విభాగం అధికారులు, సిబ్బంది ఏ మాత్రం చలనం కనిపించకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు, తాగునీటి సమస్యలపై 35 ఫిర్యాదులు సమర్పించగా, పన్నుల విభాగానికి 13, హెల్త్‌–శానిటేషన్‌కు 5 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, ఎంహెచ్‌ఓ రాజేశ్‌, వెటర్నరీ వైద్యులు గోపాల్‌రావు, పన్నుల అధికారి రామకృష్ణ, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో అనుమతి లేకుండా వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తూ నీళ్లు విక్రయిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు వినతి పత్రం అందించారు.

గొర్రెకుంట 45–2–7 నుంచి 85 వరకు సీసీ రోడ్డు నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

పోచమ్మమైదాన్‌లో బల్దియా నిర్మించిన టాయిలెట్లలో మోటారు రిపేరు చేయించాలని స్థానిక కార్పొరేటర్‌ బస్వరాజు కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.

37వ డివిజన్‌ ఎస్సీ కాలనీ కుమ్మరికుంట శ్మశాన వాటికలో సీసీ రోడ్డు నిర్మించాలని దూపాకి బాబు, సుద్దాల నాగరాజు కోరారు.

రామన్నపేట వాసవి కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు.

హనుకొండ బొక్కలగడ్డ నాలాలో వ్యర్థాలు శుభ్రం చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

హనుమకొండ సుధానగర్‌లో 3–4–488 నుంచి చివరి రోడ్డు వరకు డ్రెయినేజీ నిర్మించాలని నాగవర్మ ఆనందం వినతి అందించారు.

18వ డివిజన్‌ టీఆర్‌ కాలనీలో విద్యుత్‌ స్తంభాలు, లైట్లు, డ్రెయినేజీలు నిర్మించాలని స్థానికులు విన్నవించారు.

హనుమకొండ 10, 31 డివిజన్‌ మారుతీ హిల్స్‌లో రోడ్లు, డ్రెయినేజీలు ఆక్రమణలకు గురయ్యాయని చర్యలు తీసుకోవాలని సోసైటీ ప్రతినిధులు కోరారు.

30వ డివిజన్‌ కాకతీయ కాలనీ–2లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు స్థానికులు వినతి పత్రాన్ని అందజేశారు.

గ్రేటర్‌ గ్రీవెన్స్‌కు 111 వినతులు

ఆక్రమణలు, అతిక్రమణలపై అధిక అర్జీలు

Advertisement
 
Advertisement
Advertisement