బీఆర్‌ఎస్‌ మాటలను ప్రజలు మెచ్చట్లేదు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ మాటలను ప్రజలు మెచ్చట్లేదు

Apr 28 2026 7:17 AM | Updated on Apr 28 2026 7:17 AM

బీఆర్‌ఎస్‌ మాటలను ప్రజలు మెచ్చట్లేదు

హన్మకొండ చౌరస్తా: ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి బీఆర్‌ఎస్‌ మాటలను ప్రజలు మెచ్చడం లేదని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌, బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఆర్టీసీ కార్మికుల కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. వరంగల్‌లోని ఆర్టీసీ రిట్రైడింగ్‌ సెంటర్‌ను ఎత్తేస్తుంటే నాడు ప్రతిపక్ష హోదాలో ధర్నాలు చేసింది కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకున్న బీఆర్‌ఎస్‌ ఇప్పుడు వారి కోసం మాట్లాడడం సిగ్గుచేటన్నారు. శంకర్‌గౌడ్‌ మృతదేహం వద్ద రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులకు ఎప్పటికై నా న్యాయం చేసేది, చేసింది రేవంత్‌రెడ్డి సర్కార్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులకు బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఒక్క రూపాయి సాయం చేశారా? అని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్‌, విజయశ్రీ రజాలి, కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ నాయకుడు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, యువజన కాంగ్రెస్‌ నాయకుడు తోట పవన్‌, కుమార్‌యాదవ్‌, జాఫర్‌, సంగీత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నాయిని స్వీయ గణన

జనగణన–27 కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సోమవారం తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగణన వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు నమోదు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని, జనగణనలో ప్రతీ కుటుంబం చురుగ్గా పాల్గొనాలని కోరారు. డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement