‘అనధికారికం’పై కఠినంగా వ్యవహరించండి | - | Sakshi
Sakshi News home page

‘అనధికారికం’పై కఠినంగా వ్యవహరించండి

Apr 28 2026 7:17 AM | Updated on Apr 28 2026 7:17 AM

‘అనధికారికం’పై కఠినంగా వ్యవహరించండి

వరంగల్‌ అర్బన్‌: నగరంలోని అనధికారిక లేఔట్లపై కఠినంగా వ్యవహరించి, చర్యలు తీసుకోవాలని మేయర్‌ గుండు సుధారాణి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్‌ చాంబర్‌లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందితో మేయర్‌ సమీక్ష నిర్వహించారు. అనధికారిక లే ఔట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కారించాలన్నారు. అర్హులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, ఏసీపీలు ఖలీల్‌ అహ్మద్‌, శ్రీనివాస్‌రెడ్డి, నస్రీన్‌ భాను, టీపీఓలు, టీపీఎస్‌లు, టీపీబీఓలు పాల్గొన్నారు.

టెండర్లు పూర్తి చేయండి..

స్పెషల్‌ అసిస్టెంట్‌ ఫండ్‌ ద్వారా చేపట్టబోయే అభివృద్ధి పనులకు టెండర్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మేయర్‌ గుండు సుధారాణి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులతో మేయర్‌ సమావేశం నిర్వహించి సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. నగరంలో రోడ్లు, డ్రెయిన్లు, కమ్యునిటీ హాల్స్‌ నిర్మాణానికి సంబంధించిన నిధులు మంజూరైనట్లు తెలిపారు. పనులకు టెండర్‌ ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈఈ సంతోశ్‌బాబు, డీఈలు కార్తీక్‌రెడ్డి, రంగారావు, సతీశ్‌, రాజ్‌కుమార్‌, రాగి శ్రీకాంత్‌, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌పై నిర్లక్ష్యం వద్దు

సమీక్షలో మేయర్‌ గుండు సుధారాణి

Advertisement
 
Advertisement
Advertisement