దాతలూ.. దయ చూపండి! | - | Sakshi
Sakshi News home page

దాతలూ.. దయ చూపండి!

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

నా కొడుకును కాపాడండి

లింగాలఘణపురం : ‘దాతలు.. దయ చూపండి. నా కొడుకును కాపాడండి. నా పుత్రుడి ప్రాణం కోసం నేను కిడ్నీ ఇస్తా..కానీ ఆ అవయవ మార్పిడికి అయ్యే ఖర్చు భరించలేను. దీనిపై మనస్సున్న మహారాజులు స్పందించి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి’ అని ఓ తల్లి చేతులెత్తి వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన గండి సురేశ్‌ ట్రాక్టర్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఉన్నంతలో భార్య మౌనిక, కుమారుడు రిత్విక్‌, కూతురు సహస్ర, తల్లి ఉప్పలమ్మను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బీపీ ఎక్కువై ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించి బీపీ ఎక్కువై కిడ్నీలపై ప్రభావం చూపిందని, పెద్ద దవాఖానాలకు వెళ్లాలని చెప్పడంతో పలు ఆస్పత్రులన్నీ తిరిగి వైద్యం చేయించుకున్నాడు. అయినా ఫలితం లేకుండా పోవడంతో కిడ్నీ మార్పిడి ఒక్కటే శరణ్యమని వైద్యులు చెప్పారు. దీంతో సురేశ్‌ తల్లి ఉప్పలమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కాని మార్పిడికి అయ్యే వైద్యం ఖర్చులు సుమారు రూ.30 నుంచి 40 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంతా మొత్తం భరించలేనంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది.

విరాళాల కోసం ప్రయత్నం..

సురేశ్‌ కిడ్నీ మార్పిడి కోసం స్నేహితులు, గ్రామస్తులు ముందుకొచ్చి విరాళాలు సేకరించే ప్రయత్నం మొదలు పెట్టారు. హైదరాబాద్‌లో స్థిరపడిన కొందరు గ్రామస్తులు కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

గ్రామస్తుల సాయం రూ.2.23 లక్షలు..

సిరిపురం డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో సేకరించిన రూ.2,23,950 ఆర్థిక సాయాన్ని బుధవా రం బాధితుడు సురేశ్‌కు అందజేశారు. సురేశ్‌ మా ట్లాడుతూ తనకు గ్రామస్తులు అందించిన సా యం ఎంతో గొప్పదన్నారు. ప్రత్యేకంగా బెల్లం వేణుగోపాల్‌, ప్రొఫెసర్‌ లక్ష్మినారాయణ,తదిత రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫోరం సభ్యులు శ్రీనివాస్‌,రవీందర్‌, కుమారస్వామి పాల్గొన్నారు.

నేను కిడ్నీ ఇస్తా..

ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

చేతులెత్తి వేడుకుంటున్న తల్లి

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న

కుమారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement