వరంగల్‌ డీఆర్‌డీఓగా నాగపద్మజ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ డీఆర్‌డీఓగా నాగపద్మజ

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

కాళోజీ సెంటర్‌: వరంగల్‌ డీఆర్‌డీఓగా కె.నాగపద్మజను నియమిస్తూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నాగపద్మజ ములుగు, హనుమకొండ జిల్లాలో పనిచేస్తూ ఖమ్మం జిల్లాకు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ డీఆర్‌డీఓగా జెడ్పీ సీఈఓ రాంరెడ్డి కొనసాగుతున్నారు. బదిలీపై వస్తున్న నాగపద్మజ గురువారం లేదా శుక్రవారం విధుల్లో చేరనున్నారని సమాచారం

దరఖాస్తుల ఆహ్వానం

న్యూశాయంపేట: తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టాంకాం) ద్వారా విదేశాల్లో మైనార్టీలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్‌ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్‌ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ సుబేదారి షరీఫన్‌ మజీద్‌ ఎదుట ఉన్న మైనారిటీ కార్యాలయంలో కార్యాలయం, 0870–2980533 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

తాటిచెట్టుపైనుంచి పడి

గీత కార్మికుడి మృతి

ఐనవోలు: తాటిచెట్టుపై నుంచి పడి ఓ గీత కా ర్మికుడి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తిలో చో టు చేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గట్టు రజినీకాంత్‌(25) గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఈ క్రమంలో రోజుమాదిరిగానే బుధవారం తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్ర మాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు, కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందా డు. దీంతో తల్లిదండ్రులు విజయ, నాగేశ్‌.. కు మారుడి మృతదేహం మీద పడి గుండెలవిసే లా రోదించారు. ఇది చూసిన గ్రామస్తులు కన్నీ టిపర్యాంతమయ్యారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞ ప్తి చేశారు. కాగా, మృతుడు అవివాహితుడు.

20 నుంచి

ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు

కాళోజీ సెంటర్‌: జిల్లాలో ఈనెల 20 నుంచి 27 వరకు ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యశారద ఆదేశించా రు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. డీఈఓ రంగయ్య నాయుడు, ఏజీసీ అరుణ పాల్గొన్నారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి

పర్వతగిరి:వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కల్లెడలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాసారపు యాకయ్య(55) మంగళవారం వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి చేరుకుని ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రి కి తరలిస్తున్న క్రమంలో బుధవారం తెల్లవారుజా మున మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా, నిరుపేద వర్గానికి చెందిన యాకయ్య కుటుంబాన్ని ప్ర భుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement