● రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్న నేపథ్యంలో..
కాశిబుగ్గ: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్ర మం సందర్భంగా హెల్త్ వీక్‌లో భాగంగా నిర్వహించిన సమావేశంలో వరంగల్ ఎంజీఎం, కేఎంసీ ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ విభాగాలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కేఎంసీ ఎన్‌ఆర్‌ఐ భవనంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద ఆర్ధోపెడిక్ విభాగం, నెఫ్రాలజీ విభాగాలకు చెందిన వైద్యులను సన్మానించారు. అఽధిక ఖర్చుతో కూడిన కీళ్ల మార్పిడి సర్జరీలు, నెఫ్రాలజీలో అధిక మందికి డయాలసిస్ వైద్య సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంఽధ్యారాణి, వైవీ గణేశ్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యరాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బాలరాజు, ఆర్థోపెడిక్ హెచ్‌ఓడీ రాంకుమార్‌రెడ్డి, నెఫ్రాలజీ వైద్యులు మల్లీశ్వర్, కుమారస్వామి పాల్గొన్నారు.


