హనుమకొండ సర్కిల్‌లో పదోన్నతులేవి? | - | Sakshi
Sakshi News home page

హనుమకొండ సర్కిల్‌లో పదోన్నతులేవి?

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

హన్మకొండ : టీజీఎన్పీడీసీఎల్‌ హనుమకొండ సర్కిల్‌లో 15 సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 15 నెలలుగా ఖాళీగా ఉంటున్నాయి. ఈ పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌గా ప్రమోషన్‌ కల్పించడానికి డిపార్ట్‌మెంటల్‌ పదోన్నతి కమిటీ మార్చి 16న పదోన్నతికి కల్పిస్తూ జాబితాను సిద్ధం చేసింది. కొత్తగా ఎస్సీ వర్గీకరణ కావడంతో ఈ మేరకు గ్రూపుల వారీగా ఎస్సీలకు రిజర్వేషన్‌ కల్పించడంపై వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి హెచ్‌ఆర్‌డీకి క్లారిఫికేషన్‌ రాసినా ఆ విభాగం అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తుండడంతో 23 రోజులుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

పదోన్నతి లభిస్తుందా లేదా?

పదోన్నతి లభిస్తుందా లేదా అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని అన్ని సర్కిళ్ల పదోన్నతి ప్రక్రియ పూర్తయినా ఒక్క హనుమకొండ సర్కిల్‌లో ముందుకు సాగడం లేదు. మొదట సర్కిల్‌ అధికారులు నిర్లక్ష్యం చేయగా ఆ తర్వాత ప్రధాన కార్యాలయంలోని హెచ్‌ఆర్‌డీ విభాగం తోడవ్వడంతో ఉద్యోగులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పదోన్నతి కల్పించి పోస్టింగ్‌ ఇవ్వాల్సిన అధికారులు నాన్చివేత ధోరణి అవలంబిస్తుండడంపై ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా పదోన్నతి కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

23 రోజులుగా ఉద్యోగుల

ఎదురుచూపులు

రిజర్వేషన్‌పై సందేహ నివృత్తికి యాజమాన్యానికి లేఖ

స్పందించని టీజీ ఎన్పీడీసీఎల్‌ హెచ్‌ఆర్‌డీ విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement