● వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
వీబీ నిర్మలా గీతాంబ
ఖిలా వరంగల్: మహిళలకు ఆరోగ్యమే అతిపెద్ద ఆస్తి అని, విద్య్థార్థినులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించవచ్చని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరంగల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. యువత చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేశ్, సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రవణ్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.


