● డీజీపీ శివధర్ రెడ్డి
వెంకటాపురం(కె): ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాపెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్, ఎలైవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ద్విచక్రవాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వెనుక కూర్చునే వ్యక్తులకు సైతం హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినా రక్షణ ఉంటుదన్నారు. కారు, ఇతర వాహనాలు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సురక్షిత డ్త్రెవింగ్ చేయాలన్నారు. అనంతరం గ్రామస్తులకు హెల్మెట్లు అందజేశారు. ‘అరైవ్ ఎలైవ్’ కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించారు. సీసీఎఫ్‌ఓ సువర్ణ, ఇంటెలిజెన్స్ ఐజీ విజయ్ కుమార్, సీఆర్‌పీఎఫ్ ఐజీ విక్రమ్, ఎస్‌బీ ఐజీ సుమతి, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై తిరుపతి రావు పాల్గొన్నారు.


