కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్‌లో చేపట్టబోతున్నామని, ఇది యూనివర్సిటీ చరిత్రలో మైలు రాయి అని వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం యూనివర్సిటీ ఆడిటోరియంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులనుద్దేశించి వీసీ మాట్లాడారు. పారదర్శకతకు ఆన్‌లైన్ మూల్యాంకనం ఎంతో దోహద పడుతుందన్నారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ మాట్లాడుతూ ఆన్‌లైన్ మూల్యాంకనంతో ఫలి తాలను త్వరితగతిన విడుదల చేయొచ్చన్నా రు. రి జిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య పాల్గొన్నారు. కాగా, ఆన్‌లైన్ మూల్యాంకన ప్రక్రియకు స్కాన్ చేసే సంస్థకు చెందిన ఎక్స్‌ఫర్ట్స్ డెమో ద్వారా ఎలా వాల్యుయేషన్ చేయాలో అధ్యాపకులకు వివరించారు.


