న్యూస్‌రీల్
గ్రేటర్ వరంగల్ పరిధిలో 400 మంది బడా బకాయిదారులున్నారు. వారందరికీ రెడ్ నోటీసులు అందించి వెంటనే పన్నులు వసూలు చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. – చాహత్ బాజ్‌పాయ్,
బల్దియా ఇన్‌చార్జ్ కమిషనర్
●
నగరంలో ఇటీవల పలు డివిజన్లలో చేపట్టిన పన్నుల వసూళ్లను కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ నేరుగా పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు హనుమకొండలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలకు (ఐడీఓసీ) సంబంధించిన పన్ను బకాయిలు రూ.85,61,262 మొత్తం చెక్కును బల్దియా పన్నుల విభాగం అధికారులకు అందజేశారు. కానీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల్లో ఏమాత్రం కదలిక రాకపోగా, బల్దియా అధికారులు నోరు మెదపడం లేదు.
వరంగల్ అర్బన్ : ‘నగర వాసులు పన్నులు చెల్లించి.. అభివృద్ధికి తోడ్పడాలి’ అంటూ ఇచ్చే సందేశాలు తమకు వర్తించవు అన్నట్లుగా ఉంది అధికారుల తీరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన ఆస్తి పన్నుల విలువ కోట్లలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలైన రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, విద్య, వైద్యం, ఇరిగేషన్ మొదలుకొని కేంద్ర ప్రభుత్వ విభాగాలైన రైల్వే, పోస్టాఫీస్ వంటి సంస్థలు ఏళ్లతరబడి రూ.లక్షల మేరకు బకాయిలు ఉన్నాయి.
పేదోడిపై బల్దియా అధికారుల ప్రతాపం..
సాధారణ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించకపోతే బల్దియా అధికారులు నోటీసుల మీద నోటీసులు జారీచేశారు. ఇళ్లకు వెళ్లి రెవెన్యూ వసూలు చట్టం ప్రయోగించి ఆస్తులు జప్తు చేశారు. ఇళ్లకు, షాపులకు తాళాలు వేశారు. నిబంధనల పేరిట బజారు పాలు చేసి పరువు తీశారు. ఇదేవిధంగా సర్కారీ శాఖలకు రూ.కోట్లలో పెండింగ్‌లో ఉన్న ఆ సంస్థలకు తలుపులు లేవా? వాటిపై దృష్టి పెట్టకపోవడంఏంటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మొద్దునిద్ర..
గ్రేటర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు 1,556 పైగా ఆస్తులు ఉన్నాయి. ఏటా ఆయా శాఖల నుంచి సేవలకు గాను బల్దియా ఆస్తిపన్ను వసూలు చేస్తోంది. ఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా బాదేస్తున్న నగర పాలక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నగరంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆస్తులు 917 ఉండగా.. ప్రతీ ఏడాది రూ.3.63 కోట్లు, కేంద్ర ప్రభుత్వ శాఖలు 699 కాగా, పన్ను రూ. 67.45 లక్షలతోపాటు ఖాళీ స్థలాల బకాయిలున్నాయి. కొన్నేళ్లుగా బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఆస్తి పన్ను, వడ్డీ కలిపి రూ.80 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి.
కేంద్ర
ప్రభుత్వ
శాఖలు
639
పన్నుల వసూళ్లలో ‘గ్రేటర్’ అధికారుల తీరుపై విమర్శలు
సర్కారీ శాఖల్లో రూ.కోట్లలో బకాయిలు
రూ.వందలు, వేలు పెండింగ్ ఉన్న
పేదలపైనే ప్రతాపం!
‘బడా’ వసూళ్లపై అధికారుల నిర్లక్ష్యం


