ఆకట్టుకున్న ‘జగన్నాథ దేవాలయ చరితం’ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘జగన్నాథ దేవాలయ చరితం’

Apr 1 2026 7:18 AM | Updated on Apr 1 2026 7:18 AM

ముగిసిన పోతన విజ్ఞాన పీఠం వార్షికోత్సవం

హన్మకొండ కల్చరల్‌: పోతన విజ్ఞానపీఠం 39వ వార్షికోత్సవంలో భాగంగా చివరిరోజు జగన్నాథ దేవాలయ చరితం నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంగళవారం వరంగల్‌లోని పోతనవిజ్ఞాన పీఠం ఆడిటోరియంలో గందె శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా సీఏ త్రిపురనేని గోపిచంద్‌, ఆత్మీయ అతిథులుగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, నెల్లుట్ల రవీందర్‌రావు, పీఠం మేనేజర్‌ జేఎన్‌ శర్మ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పౌరాణిక కళాకారుడు పల్లకొ ండ రాజేందర్‌ను సన్మానించి ‘నటచతుర’ బిరుదు ప్రదానం చేశారు. అనంతరం పోతన విజ్ఞానపీఠం వారిచే పీఎల్‌ఎన్‌ ప్రసాద్‌ రచించిన జగన్నాథ దేవాలయ చరితం చారిత్రక, పౌరాణిక వచన నాటకాన్ని కుసుమ సుధాకర్‌ దర్శకత్వంలో ప్రదర్శించారు. జగన్నాథుడిగా జూలూరి నాగరాజు, విశ్వావసుగా కాజీపేట తిరుమలయ్య, నారధుడిగా గొట్టె రమేశ్‌, ఇంద్రద్యుయుడుగా జేఎన్‌ శర్మ, విద్యావతిగా కుసు మ సుధాకర్‌, లలితగా సురభిహారిక తదితరులు పాత్రలు పోషించారు. నాటక నిర్వహణ అడ్లూరి చంద్రశేఖర్‌, సహకారం షఫీమహ్మద్‌, మాలిజయరాజ్‌, సురభి సంతోష్‌ రాగాలంకరణ చేయగా,బాపనపల్లి పరమేశ్వర్‌ మేకప్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement