హన్మకొండ కల్చరల్ : భద్రకాళి ఆలయంలో 50 అడుగుల నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ వద్ద గల వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ జోన్‌లో సుమారుగా 50 ఫీట్ల ఎత్తుతో తెలంగాణలో అ త్యంత అరుదుగా దొరికే నార వేప కర్రను ఎంచుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు గాదె శ్రవణ్‌కుమార్, మోత్కురి మయూరి, ఓరుగంటి పూర్ణచందర్, జారతి వెంకటేశ్వర్లు, పాలడుగుల ఆంజనేయులు పరిశీలించారు. ధ్వజస్తంభం 20రోజుల్లో ఆలయానికి చేరేలా చర్యలు తీసుకుంటామని ధర్మకర్తలు వివరించారు.


