వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి గుగులోత్ అశోక్ కుమార్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా (డీడీ) పదోన్నతి కల్పించారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీ అండ్ ఎండీ సోనీ బాలాదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తీరాం తండాకు చెందిన గుగులోత్ అశోక్ కుమార్ 2011లో సాట్‌లో రెజ్లింగ్ కోచ్‌గా నియామకం అయ్యారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో డీవైఎస్‌ఓగా విధులు నిర్వర్తించిన అశోక్ కుమార్ ఆరేళ్ల క్రితం హనుమకొండకు బదిలీపై వచ్చారు. చిన్న వయస్సులో డీడీగా పదోన్నతి పొందడంతో అశోక్ కుమార్‌ను వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, కోచ్‌లు అభినందించారు. కాగా తదుపరి హనుమకొండ డీవైఎస్‌ఓ ఎవరినేది సాట్ స్పష్టత ఇవ్వకపోవడం విశేషం.


