పన్ను వసూళ్లలో వెనుకబాటు | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లలో వెనుకబాటు

Apr 1 2026 7:18 AM | Updated on Apr 1 2026 7:18 AM

పన్ను వసూళ్లలో వెనుకబాటు

వరంగల్‌ అర్బన్‌ : వందశాతం ఆస్తి, నీటి పన్నుల వసూళ్ల లక్ష్యంగా ముందుకు సాగిన గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) అంచనాలు తలకిందులయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 2025–26 ఆర్థిక సంవత్సరం గడువు ముగిసే వరకు వసూళ్ల పర్వాన్ని కొనసాగించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టుకోలేక పోయారు. గ్రేటర్‌ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మినహా కమర్షియల్‌, మిక్స్‌డ్‌ భవనాలు, నివాస గృహాలు 2,36,263 ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం డిమాండ్‌ మొత్తం రూ.182.19 కోట్లు ఉంది. మంగళవారం రాత్రి 10గంటల వరకు బల్దియా యంత్రాంగం సుమారు రూ.90.20 కోట్ల పన్ను వసూలు చేసినట్లు ధ్రువీకరించారు. ఆస్తి పన్ను వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటర్‌ చార్జీలు తదితర వివరాలను వెల్లడించేందుకు సెంట్రల్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెస్‌ (సీజీజీ) వెబ్‌సైట్‌ సాంకేతిక లోపం వల్ల సరైన సమాచారం అందించేలేకపోతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement