వరంగల్ లీగల్ : గుర్తు తెలియని మెయిల్ ద్వారా వరంగల్ జిల్లా ఫ్యామిలీ కోర్టుకు సోమవారం బాంబ్ బెదిరింపు సమాచారం అందింది. దీంతో బెంబేలెత్తిన కక్షిదారులు, న్యాయవాదులు కోర్టు హాల్ నుంచి బయటికి పరుగులుతీశారు. జిల్లా జడ్జి ఫిర్యాదుతో బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గతంలో కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ చేసి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కోర్టు ప్రధాన ప్రవేశ మార్గాల్లో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.


