విద్యార్థులు ఒత్తిడిని జయించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఒత్తిడిని జయించాలి

Mar 30 2026 7:16 AM | Updated on Mar 30 2026 7:16 AM

విద్యార్థులు ఒత్తిడిని జయించాలి పోలీస్‌ శాఖ ప్రతిష్ట పెంచాలి

వర్ధన్నపేట/హసన్‌పర్తి: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భీమారంలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్‌ను కలెక్టర్‌ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మమేకమై వారి చదువు, పరీక్షల సన్నాహాలు, హాస్టల్‌ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదలతో చదువుకుంటూ పాఠాలను పునరావృతం చేస్తే మంచి ఫలి తాలు సాధించవచ్చన్నారు. వత్తిడికి లోనుకా కుండా సానుకూల ధృక్ఫధంతో ముందుకు సా గాలన్నారు. విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.

1 నుంచి చికెన్‌ షాపుల బంద్‌

ఖిలా వరంగల్‌ : ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి చికెన్‌ షాపుల నిరవధిక బంద్‌ పాటిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని బ్రాయిలర్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం వరంగల్‌ ఉర్సు గుట్ట వద్ద అసోసియేషన్‌ ప్రచార కార్యదర్శి మాచర్ల రవీందర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. చికెన్‌ ధరలు పెరడగడంతో లాభాలు తగ్గి నిర్వహణ భారం మీద పడుతోందని, కంపెనీ డీలర్లు సైతం మార్జిన్‌ తగ్గించడంతో నష్టాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు చికెన్‌ షాపుల నిరవధిక బంద్‌కు మద్దతు తెలు పాలని వారు కోరారు. అసోసియేషన్‌ నాయకులు సిందాం వీరప్రసాద్‌, నల్లెల శ్రీనివాస్‌, ఎండీ.ముఫీద్‌, సమీద్దీన్‌, కొండ్రెరెడ్డి నవీన్‌రెడ్డి, మామిడి రాజు, తదితరులు పాల్గొన్నారు.

జిరాక్స్‌ సెంటర్‌ దగ్ధం

హసన్‌పర్తి: షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ జిరాక్స్‌ సెంటర్‌ దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ–2 గేట్‌ సమీపంలో కార్తీకేయ పేరుతో ఓ వ్యక్తి జిరాక్స్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున షార్ట్‌ సర్క్యూట్‌తో జిరాక్స్‌ సెంటర్‌ దగ్ధమైంది. ఈ సంఘటనలో మూడు జిరాక్స్‌ మిషన్లు, మూడు కంప్యూటర్లు, రెండు ఫ్యాన్లు, మూడు ప్రింటర్లు, నగదు, మెరిటీయల్‌ కూడా దగ్ధమైంది. ఎస్సై నవీన్‌ సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, అధ్యాపకులు, ప్రొఫెసర్‌ రమేశ్‌ నిర్వాహకుడిని ఓదార్చారు.

ఖిలా వరంగల్‌ : పోలీస్‌ శాఖ ప్రతిష్టను పెంచాలని పోలీస్‌ శిక్షణ కళాశాల(పీటీసీ) ప్రిన్సి పాల్‌ కె.రమేశ్‌ సూచించారు. ఆదివారం మా మునూరు పోలీస్‌ శిక్షణ కళాశాలలో ఆరు వా రాలుగా నిర్వహించిన సివిల్‌ కానిస్టేబుళ్ల పదోన్నతి శిక్షణ ముగింపు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్‌ హాజరై మాట్లాడుతూ.. వివిధ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల సేవాభావంతో పనిచేయాలని, సమస్యలు త్వరగా పరిష్కరించి పోలీస్‌ శాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. డీఎస్పీలు విజయ్‌, రవీందర్‌, వెంకటేశ్వరరావు, సోమాని నాయక్‌, మెడికల్‌ ఆఫీసర్‌ నరేష్‌, రామ్మూర్తి, సత్యనారాయణ, సుధాకర్‌, దీపక్‌, అశోక్‌, రాజ్యలక్ష్మి, మంగ మ్మ, ఫార్మసిస్ట్‌ వెంకటేశ్వర్లు, శిక్షణ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement