హసన్‌పర్తి: నగరంలోని ఎర్రగట్టు గుట్ట సమీపంలోని షైన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఎస్–ఎస్‌ఏటీ(షైన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్)కు అనూహ్య స్పందన లభించింది. 4 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. 470 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 4వ తరగతికి 65 మంది, 5వ తరగతికి 70మంది, 6వ తరగతికి 85 మంది, 7వ తరగతికి 105 మంది, 8వ తరగతికి 145మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా షైన్ పబ్లిక్ స్కూల్ ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జక్కుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటీ, జేఈఈ/నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


