నైపుణ్యాల బలోపేతానికి ఎఫ్‌ఎల్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాల బలోపేతానికి ఎఫ్‌ఎల్‌ఎస్‌

Mar 30 2026 7:16 AM | Updated on Mar 30 2026 7:16 AM

విద్యారణ్యపురి: ప్రాథమిక పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పరిశీలన, ప్రాథమిక నైపుణ్యాల బలోపేతానికి ఎఫ్‌ఎల్‌ఎస్‌ (ఫౌండేషన్‌ లెర్నింగ్‌ స్టడీ)ను ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. హనుమకొండ, వరంగల్‌, ములుగు, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల భాష, గణిత అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించనున్నారు. అన్ని జిల్లాల్లోనూ మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కొంతకాలంగా కృషిచేస్తున్నారు. ఇప్పటికే రెండు మౌఖిక టెస్టులను కూడా నిర్వహించి సన్నద్ధం చేశారు.

ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లుగా డీఈడీ, బీఈడీ విద్యార్థులు

ఎఫ్‌ఎల్‌ఎస్‌ సర్వే నిర్వహించేందుకు జిల్లాల్లోని డీఈడీ, బీఈడీ విద్యార్థులను ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లుగా తీసుకున్నారు. అలాగే, ప్రతీ జిల్లా నుంచి డీఎల్‌ఎంటీ కూడా ఉన్నారు. డీఎల్‌ఎంటీలు, డీఎల్‌సీలుగా ఉన్న జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్లకు ఇప్పటికే హైదరాబాద్‌లో ఎఫ్‌ఎల్‌ఎస్‌ సర్వే స్టడీపై శిక్షణ ఇచ్చారు. ఈనెల 26న హనుమకొండ ప్రభుత్వ డైట్‌లో నాలుగు జిల్లాల ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ ఇచ్చారు. కేటాయించిన పాఠశాలలకు ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లు రెండు రోజులపాటు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతీ పాఠశాలలో 12 మంది విద్యార్థుల నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి ట్యాబ్‌లోనే నిక్షిప్తం చేయాలి. ర్యాండమ్‌గా విద్యార్థులను ఎంపిక చేసుకుని సర్వేనిర్వహిస్తారు. సర్వే పూర్తయ్యాక ఆయా ట్యాబ్‌లను జిల్లాల నుంచి హైదరాబాద్‌కు పంపుతారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

మూడో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాల పరిశీలన

ఈనెల 30, 31 తేదీల్లో ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్ల సర్వే

ఎఫ్‌ఎల్‌ఎన్‌కు

ఎంపిక చేసిన

పాఠశాలల వివరాలు..

జిల్లా పాఠశాలలు

హనుమకొండ 3

వరంగల్‌ 4

భూపాలపల్లి 5

ములుగు 6

జనగామ 4

మహబూబాబాద్‌ 7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement