ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టు భవనంలో జిల్లాల న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు, ఇందులో సివిల్ కేసులు 267, ఎంవీఓపీ కేసులు 34 (రూ.61,25,961), క్రిమినల్ కేసులు 794, బ్యాంకు పీఎల్‌సీ కేసులు 41, ఎలక్ట్రిసిటీ పీఎల్సీ కేసులు 230, ట్రాఫిక్ ఈ–చాలన్ కేసులు 59,603, బీఎస్‌ఎన్‌ఎల్ కేసులు 10, సైబర్ క్రైమ్ 13 కేసులను పరిష్కరించినట్లు తెలి పారు. లోక్ అదాలత్ విజయవంతమైందని పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేయగా.. జిల్లా కేంద్రంలో 8, పరకాలలో 2, బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు న్యాయమూర్తులు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి తెలిపారు. మొత్తం 474 పెండింగ్ కేసుల్లో సివిల్ కేసులు 48, యమ్ వీఓపీ కేసులు 41, (రూ.2,54,60,000)ల క్రిమినల్ కేసులు 426, బ్యాంక్ పీఎల్‌సీ కేసులు 29, సైబర్ క్రైమ్ కేసులు 29, సమ్మర్ ట్రయల్ కేసులు 8,282 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. అందరి సహకారంతో లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాల న్యాయమూర్తుల నారాయణబాబు, ప్రేమలత, క్షమాదేశ్ పాండే, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, రామలింగం, డీసీపీ దార కవిత, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


