అలరించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటకం | - | Sakshi
Sakshi News home page

అలరించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటకం

Mar 28 2026 7:10 AM | Updated on Mar 28 2026 7:10 AM

అలరించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటకం

ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం

హన్మకొండ కల్చరల్‌: ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ నాటక కళాపరిషత్‌ వరంగల్‌ వారి ఆధ్వర్యంలో అభినవ ఆంజనేయ బిరుదాంకితులు జమ్మలమడక కృష్ణమూర్తి స్మారకంగా నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన అలరించింది. ఈమేరకు శుక్రవారం పోతన పీఠంలో జరిగిన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని యూత్‌కాంగ్రెస్‌ నాయకులు విష్ణురెడ్డి, వరంగల్‌ జిల్లా బీజేపీ నాయకులు గంటా రవికుమార్‌, సీనియర్‌ కళాకారులు తడకమల్ల రామచంద్రరావు, ఆకుల సదానందం, జేఎన్‌ శర్మ, నేరెళ్ల శోభావతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రదర్శించిన పద్యనాటకం ప్రేక్షకులను అలరించింది. అనంతరం యోగా సాధకులు మినుపూరి సంధ్య, పోరెడ్డి రాణి, జిల్లా రంగస్థల కళాకారులను సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement