వరంగల్ చౌరస్తా: హజ్ యాత్రకు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా తెలిపారు. హనుమకొండ జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎంజీఎం హాస్పిటల్, జిల్లా హజ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్‌లోని ఐఎంఏ హాల్ నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఖుస్రూపాషా మాట్లాడుతూ.. యాత్రకు వెళ్లేవారు డాక్టర్స్ ఇచ్చిన సలహాలు తప్పకుండా పాటించాలన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. గురువారం 53 మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ, ఎండీ నజీముద్దీన్, జిలానీ, ఇన్‌చార్జ్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగరాణి, డాక్టర్ రెహమాన్, డాక్టర్ రుబీనా అప్రోజ్, జిల్లా మాస్ మీడియా అధికారిఅశోక్ రెడ్డి, జునేది, రమేశ్, శిరీష ప్రవీణ్, రెహమాన్, జమాలుద్దీన్ పాల్గొన్నారు.
రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా


