హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్‌గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును అదిలాబాద్ రీజినల్ మేనేజర్‌గా బదిలీ చేయగా, ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్న భవానీప్రసాద్‌ను వరంగల్ రీజినల్ మేనేజర్‌గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది.


