కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో సైన్స్ విభాగాల్లో 2026–2027 జనవరి సెషన్‌లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు గురువారం తెలిపారు. ఫెల్లోషిప్ అభ్యర్థులు యూజీసీ జేఆర్‌ఎఫ్, /సీఎస్‌ఐఆర్/ సీడ్/డీఈటీ/ ఎన్‌ఎఫ్‌పీడబ్ల్యూడీ, డీఎస్‌టీ–ఇన్స్‌ఫైర్ లేదా ఫిప్, క్విప్ టీచర్ ఫెల్లోషిప్స్, అలాగే నెట్, గేట్, జిప్యాట్ కలిగిన అభ్యర్థులు ఈ పీ హెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు సైన్స్ విభాగాల డీన్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సింటుంది. విభాగాల వారీగా వెకెన్సీలు ఇలా ఉన్నాయి. బయోకెమిస్ట్రీ 3, బయోటెక్నాలజీ 4, బాటనీ 4, కెమిస్ట్రీ 4, కంప్యూటర్ సైన్స్ 5, జియాలజీ 1, మ్యాథ్‌మెటిక్స్ 9, మైక్రోబయాలజీ 6, ఫిజిక్స్ 6, జువాలజీ 13 సీట్లు వెకెన్సీలుగా ఉన్నాయని డీన్ హనుమంతు తెలిపారు.
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చ రల్ : భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి పసుపు రంగు చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భద్రకాళి సాంగ ఆగమవేదపాఠశాల విద్యార్థులు పువ్వులకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు పాజూరి శ్రీరాం, శ్రావణి, సబిత, సమత, పబ్బ శివకుమార్ ఉభయదాతలుగా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపద గిరిజన విజ్ఞానపీఠం డీన్ గడ్డం వెంకన్న, సతీశ్, సినీనటులు దీపక్‌సరోజ్, రచ్చ రవి, ప్రొడ్యూసర్ హరిబాబు, డైరెక్టర్ హరీశ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయ ధర్మకర్త వీరన్న, పరిశీలకులు క్రాంతికుమార్, సిబ్బంది పర్యవేక్షించారు.
సద్దుమణిగిన
విద్యార్థుల వివాదం
కాశిబుగ్గ: వరంగల్‌లోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థుల దాడి ఘటన ఎట్టకేలకు సద్దుమణిగింది. వారం రోజుల క్రితం స్థానిక యువకులు ఆయుర్వేద వైద్య విద్యార్థులపై చేయి చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో స్థానిక నాయకులు కదలివచ్చారు. కొంతమంది నాయకుల తనయులు సైతం ఇందులో ఉండడంతో ఈ ఘటన పెద్దది కాకముందే జాగ్రత్త పడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్‌తో సమావేశమై ఈ ఘటన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిపై తాము విచారిస్తున్నామని, అలాగే ఘటనకు బాధ్యులైన స్థానికుల యువకులతో క్షమాపణ చెప్పించి, కాంప్రమైజ్ చేశారు. అలా గే, ఈ దాడి గురించి తెలుసుకున్న మిల్స్‌కాలనీ ఎస్సైలు నరేశ్, శ్రవణ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులను ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాలు శాంతించడంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఇక నుంచి ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.


