వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ రంగశాయిపేట శివారు జక్కలొద్ది మైనార్టీ గురుకులంలో శుక్రవారం ‘రోడ్డు భద్రత–ట్రాఫిక్ నియమాలు’ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ట్రాఫిక్ నియమాలపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఆర్‌ఎల్సీ డాక్టర్ జంగా సతీశ్, ప్రిన్సిపాల్ భిక్షపతి పాల్గొన్నారు.
జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శిని కలిసిన కలెక్టర్
భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావును హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క అందజేశారు.


