బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి
హన్మకొండ: కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు జరిగే బీజేపీ వరంగల్ పశ్చిమ కార్యకర్తల మొదటి శిక్షణ శిబిరం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ప్రశిక్షణ అభియాన్ హనుమకొండ హంటర్ రోడ్డులోని వేదవ్యాస ఆవాసంలో శనివారం ప్రారంభమైంది. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రావు పద్మ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ, దొంతి దేవేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పీ.జయంత్‌లాల్, సండ్ర మధు.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పార్టీ మార్గదర్శకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. రావు పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త పండిట్ జీ ఆశయాలను ఆకళింపు చేసుకుని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే ల క్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


