హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
కాజీపేట అర్బన్ : మాతృత్వం ఒక వరం..ఆ కలను సాకారం చేసుకునేందుకు పిల్లలు లేని తల్లిదండ్రులు చట్టబద్ధమైన దత్తతను మాత్రమే స్వీకరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండ కంచరకుంటలోని శిశుగృహలో బుధవారం వడ్డేపల్లికి చెందిన దంపతులకు నాలుగు నెలల శిశువును దత్తతగా కలెక్టర్ అందజేశారు. కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న దంపతులకు సీనియారిటీ ఆధారంగా, దత్తతకు ఎంపికై న శిశువును అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీఓ విశ్వజ, ఇన్‌చార్జ్ శిశుగృహ మేనేజర్ మాధవి పాల్గొన్నారు.


