శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Nov 28 2025 11:51 AM | Updated on Nov 28 2025 11:51 AM

శుక్ర

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

– 8లోu

న్యూస్‌రీల్‌

గోల్డ్‌ మెడల్స్‌తో..

కాజీపేట అర్బన్‌: అప్పటి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నాటి ఆర్‌ఈసీ, నేటి నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌కు 1959 అక్టోబర్‌ 10న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నాణ్యమైన విద్యనందిస్తూ విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తున్న ఈ క్యాంపస్‌ 23వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. నిట్‌ వరంగల్‌లోని అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ మహోత్సవంలో బీటెక్‌ 953 మంది, ఎంటెక్‌ 556, ఎంఎస్సీ 149, ఎంబీఏ 38, 56 ఎంసీఏ, 142 పీహెచ్‌డీ, 19 మంది బీఎస్సీ, పీజీ డిప్లొమా విభాగాల్లో 1,913 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకోనున్నట్లు పేర్కొన్నారు. 23వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా మైక్రోన్‌ ఇండియా వ్యవస్థాపక మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ రామమూర్తి, సీయాంట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, డీఆర్డీఓ సైంటిస్ట్‌ డాక్టర్‌ సమీర్‌ వి.కామత్‌ హాజరుకానున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ తెలిపారు. స్నాతకోత్సవానికి బాయ్స్‌ తెల్లటి కుర్తా, పైజామాలో రావాలని, గర్ల్స్‌ పంజాబీ డ్రెస్‌, బ్లాక్‌ షూస్‌తో పాటు మెడలో కండువాతో హాజరుకావాలని ఆయన సూచించారు.

నిట్‌ వరంగల్‌లో విద్యనభ్యసించి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన 23వ స్నాతకోత్సవంలో తొలిసారి గోల్డ్‌మెడల్స్‌ను అందజేయనున్నారు. అన్ని రంగాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు, ఓవరాల్‌ టాపర్లుగా నిలిచిన వారికి డైరెక్టర్స్‌ గోల్డ్‌ మెడల్‌ పేరిట గోల్డ్‌ మెడల్స్‌ను అందజేయనున్నారు. డైరెక్టర్‌ గోల్డ్‌ మెడల్స్‌ను బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పాలచర్ల శ్రీ సత్య నవీన్‌, ఎంటెక్‌ పవర్‌ సిస్టమ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కొండా శౌష్య, ఎంఎస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో రోహన్‌ గుప్తా అందుకోనున్నారు.

ఆర్మీ దళానికి ఇండీజీనస్‌ సిస్టమ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ఆవిష్కరణకుగాను డీఆర్డీఓ సైంటిస్ట్‌ డాక్టర్‌ సమీర్‌ వి.కామత్‌కు హానరీస్‌ కాసా పేరిట డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేయనున్నారు.

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 20251
1/3

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 20252
2/3

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 20253
3/3

శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement