‘రిలయన్స్’ స్టోర్‌కు రూ.50 వేల జరిమానా
రామన్నపేట/ వరంగల్ అర్బన్: వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నందుకు ఓ స్టోర్‌కు జరిమానా విధించినట్లు బల్దియా సిబ్బంది తెలిపారు. వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని రిలయన్స్ స్మార్ట్ సూపర్‌స్టోర్ ఎదుట స్టోర్‌కు సంబంధించిన వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో బుధవారం రూ.50 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. జరిమానా చెల్లించే వరకూ క్రయవిక్రయాలు జరపకుండా స్టోర్‌ను బల్దియా సిబ్బంది ద్వారా మూసివేయించినట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ పేర్కొన్నారు.
నేడు రైల్వే గ్రీవెన్స్ క్యాంప్
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్‌లోని రైల్వే కమ్యూనిటీహాల్‌లో గురువారం రైల్వే స్టాఫ్ గ్రీవెన్సె క్యాంప్ నిర్వహిస్తున్నట్లు రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ కమిటీ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జి.ఆర్.సుధీర్‌కుమార్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ఉద్యోగుల నుంచి వినతులు తీసుకుంటామని తెలిపారు. రైల్వే ఏపీఓ గిరిజ, చీఫ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్లు వి.రాజేంద్రప్రసాద్, సి.వి.వి.రెడ్డి, బి.గణేశ్‌కుమార్, చీఫ్ ఓఎస్‌లు, ఇతర అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
‘రిలయన్స్’ స్టోర్‌కు రూ.50 వేల జరిమానా


