విద్యాపరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలి
కాళోజీ సెంటర్: విద్యాపరిరక్షణ ఉద్యమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ విద్యాపరిరక్షణ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.తిరుపతిరెడ్డి, ఎ.శ్రీనివాస్ రెడ్డి, గోవిందరావు, యాకయ్య, ఉప్పలయ్య, శ్రీని వాస్ పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ విద్యా పరిరక్షణ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.


