అదుపు తప్పి గుంతలోకి వెళ్లిన ట్రాక్టర్..
● కిందపడి డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం
● వర్ధన్నపేటలో ఘటన
వర్ధన్నపేట: ట్రాక్టర్ అదుపు తప్పి గుంతలోకి వెళ్లడంతో కిందపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కొండేటి బాబు(42).. రైతు కొండేటి సత్యం వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం వ్యవసాయ క్షేత్రంలో హార్వెస్టర్.. వరి కోస్తున్న క్రమంలో ధాన్యాన్ని ట్రాక్టర్ ట్రాలీలో నింపుకుని వస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి గుంతలోకి వెళ్లగా బాబు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శార ద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


