యువకుడి ఆత్మహత్య
కాజీపేట : మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కాజీపేట బాపూజీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకర్ పట్నం మండలం లింగాపూర్‌కు చెందిన గుర్రం రాం కిరణ్ (24) కొద్ది రోజులుగా రైల్వే డీజిల్ షెడ్‌లో అప్రెంటీస్ చేస్తున్నాడు. మిత్రులతో కలిసి బాపూజీనగర్ కాలనీలో గది అద్దె తీసుకుని డీజిల్ షెడ్‌కు వెళ్లొస్తుండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఏ తెలియని సమస్యతో మనోవేదనకు గురవుతున్నాడు. బుధవారం తెల్లవారు జామున గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మి త్రులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై శివ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.


