29న కేయూలో అందెశ్రీ యాది సభ
కేయూ క్యాంపస్: ప్రజాకవి, రచయిత డాక్టర్ అందెశ్రీ యాది సను ఈనెల 29న కేయూలో నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ సీతారాంనాయక్, తెలంగాణ ఉద్యమకారుల చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, డాక్టర్ వీఎస్ రెడ్డి, కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు తెలిపారు. కేయూ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రగీతాన్ని రచించి ప్రజాకవిగా పేరొందిన అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మొట్టమొదటిసారిగా అందెశ్రీకి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చి సత్కరించిందన్నారు. అందెశ్రీ యాది సభకు ఆచార్యులు, విద్యార్థులు, పరిశోధకులు, కళాకారులు, కవులు, రచయితలు, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. సమావేశంలో తెలుగు విభాగం ఇన్‌చార్జ్ అధిపతి డాక్టర్ మామిడాల లింగయ్య, కవి పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు డాక్టర్ కర్రె సదాశివ్, ఎర్రబొజ్జు రమేశ్, నవీన్, రవిచందర్ పాల్గొన్నారు. తొలుత గెస్ట్‌హౌస్‌లో అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


