ఎంజీఎం డిప్యూటీ సివిల్ సర్జన్‌గా మధుకర్
ఎంజీఎం: ఎంజీఎం డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ మధుకర్‌యాదవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా విధులు నిర్వర్తించిన డాక్టర్ వసంతరావు పదోన్నతిపై సంగారెడ్డి డీఎంహెచ్‌ఓ బదిలీ అయ్యారు. కాగా, జనగామ జీజీహెచ్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ మధుకర్ యాదవ్‌ను పదోన్నతిపై ఎంజీఎం ఆర్‌ఎంఓగా బదిలీ చేశారు. బుధవారం ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్‌చంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, నాయకులు ఖాజా, లక్ష్మీప్రసాద్, వంశీ, ఆఫీస్ సూపరింటెండెంట్ అలీ, రాధాకృష్ణ, ఆనంద్ పాల్గొన్నారు.
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలందించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గురువారం ‘డయల్ యువర్ డీఎం’ నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. ఈనెల 27న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్‌పర్తి, కమలాపూర్, వరంగల్ మండలాల ప్రయాణికులు, ట్రైసిటీ ప్రయాణికులు 89777 81103 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలివ్వాలని సూచించారు.
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ రెజ్లింగ్ పోటీల్లో వరంగల్ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ క్రీడాకారులు మూడు బంగారు, మూడు వెండి, ఒక కాంస్య పతకంతో సత్తా చాటారు. పతకాలను సాధించిన క్రీడాకారులను బుధవారం హనుమకొండలోని జేఎన్ స్టేడియంలోని తన కార్యాలయంలో డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ అభినందించారు. అండర్–17 గ్రీకో రోమన్ స్టైల్‌లో ఎస్.మనోహర్ (48 కిలోలు), ఆర్.శ్రీకాంత్(55 కిలోలు) గోల్డ్ మెడల్స్, సీనియర్స్ రెజ్లింగ్ పోటీల్లో కె.అఖిల్ (63 కిలోలు) గోల్డ్ మెడల్ సాధించాడు. టి.వెంకటేశ్ (65 కిలోలు), ఆర్.దత్తు (55 కిలోలు), ఎ.రాహుల్ 57 కిలోల విభాగాల్లో రజత పతకాలు సాధించారు. ఇ.వరుణ్ 63 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన వారిలో ఉన్నారు. డీఎస్‌ఏ కోచ్‌లు జయపాల్, రాజు అభినందించారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: భారత రాజ్యాంగం స్ఫూర్తిదాయక పుస్తకమని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి ప్రాథమిక హక్కులు, విధులను కల్పించిందని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన విలువలను ప్రతిఒక్కరూ గౌరవించి కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మెప్మా పీడీ జోనా, పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగంతోనే సమాన ఫలాలు
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: దేశంలో అందరికీ సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని కలెక్టర్ సత్యశారద అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. అధికారులు సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎంజీఎం డిప్యూటీ సివిల్ సర్జన్‌గా మధుకర్


