ఒక సీఐ..రెండు స్టేషన్లు!
కాజీపేట అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 14 ఎకై ్సజ్ స్టేషన్లను నెలకొల్పేందుకు ఈనెల 22వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్) జిల్లా పరిధిలో కాజీపేట, హనుమకొండ, వరంగల్ అర్బన్, ఖిలా వరంగల్ ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా, నూతనంగా హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌ను ప్రారంభించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో ఈనెల 24వ తేదీన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎకై ్సజ్ స్టేషన్‌ను ఆర్భాటంగా ప్రారంభించారు.
హనుమకొండ సీఐకి హసన్‌పర్తి
ఇన్‌చార్జ్ బాధ్యతలు..
హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న దుర్గాభవాని నూతనంగా ప్రారంభించిన హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఒక్క సీఐ రెండు స్టేషన్ల బాధ్యతలు చేపట్టాల్సి వస్తోంది. అదేవిధంగా హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్‌లోని ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లు సైతం ఇన్‌చార్జ్ పాలన హసన్‌పర్తి స్టేషన్‌కు కొనసాగించే అవకాశం ఉంది. హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని 25 వైన్స్, 41 బార్లలో సగం వరకు నూతన ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోకి, హనుమకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో హనుమకొండ, హసన్‌పర్తి ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలతోపాటు పలు డివిజన్లు, హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌కు, హనుమకొండ మండల పరిధిలో కొంత భాగం, హసన్‌పర్తి మండలంలో కొంత భాగం, కమలాపూర్ మండలం పూర్తి స్థాయిలో ఉంటుంది.
పోస్టింగ్ లేకుండా ఎకై ్సజ్ స్టేషన్లు..
ఎకై ్సజ్ శాఖలో అధిక వైన్స్, బార్లు గల స్టేషన్లలో మరో స్టేషన్‌ను ప్రారంభించాలనే దిశగా ప్రభుత్వం ఏడాదిన్నర నుంచి అడుగులు వేస్తూ వచ్చింది. నూతన ఎకై ్సజ్ స్టేషన్‌కు సిబ్బందిని నియమించి స్టేషన్లను ప్రారంభిస్తే సిబ్బందికి ఇబ్బందులు తలెత్తవు. ఇందుకు భిన్నంగా సిబ్బందికి పోస్టింగ్ లేకుండా హడావుడిగా ఎకై ్సజ్ స్టేషన్‌ను ప్రారంభించారు.
పర్యవేక్షణకు నూతన ఎకై ్సజ్ స్టేషన్లు..
ప్రభుత్వం వైన్స్, బార్ల పర్యవేక్షణ కోసం నూతన ఎకై ్సజ్ స్టేషన్లను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌ను ప్రారంభించుకున్నాం. ఎకై ్సజ్ నేరాల నివారణకు, మద్యంపై నిఘా పెంచేందుకు నూతన ఎకై ్సజ్ స్టేషన్ తోడ్పడుతుంది. నూతన ఎకై ్సజ్ స్టేషన్‌కు త్వరలో సిబ్బందిని ప్రభుత్వం కేటాయిస్తుంది.
– చంద్రశేఖర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్,
హనుమకొండ జిల్లా
సిబ్బంది లేకుండా హసన్‌పర్తి
ఎకై ్సజ్ స్టేషన్ ప్రారంభం
ఒక సీఐ..రెండు స్టేషన్లు!


